Thursday, April 25, 2024
- Advertisement -

ఫోటో పెట్టి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ వరుసగా తమ వెడ్డింగ్ న్యూస్ ని అనౌన్స్ చేస్తున్నారు. రానా, నితిన్ పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతున్నారు. మెగా ఫ్యామిలీ లో కూడా త్వరలో పెళ్లి బాజాలు మోగుతున్నటూ కనిపిస్తున్నాయి. మొన్ని ఈ మధ్యనే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు.

అబ్బాయిని వెతుకుతున్నాం త్వరలో మంచి సంబంధం సెలెక్ట్ చేస్తాం. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో పెళ్లి ఉంటుందని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కగానొక్క కొడుకుతో నిహారిక పెళ్లి జరిపించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం రోజు ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని డిసిషన్ తీసుకుని ఎంగేజ్ మెంట్ ఆగస్టులో పెళ్లి 2021 ఫిబ్రవరి లో చేసేందుకు రెడీ అయ్యారట మెగా ఫ్యామిలీ. ఈ పెళ్లి వార్త నిజమని నిహారిక నిన్న పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

స్టార్ బక్స్ కప్ పెట్టి చేసి మిస్ నిహా అని ఉంటే మిస్ ని క్యాన్సిల్ చేసి మిస్ట్రస్ క్వశ్చన్ మార్క్ ఉన్న ఫోటో పెట్టడం తో మరోసారి నిహారిక పెళ్లి టాపిక్ వైరల్ అవుతోంది. నిహారిక పెళ్లి ఫిక్స్ అయినట్లు హింట్ ఇచ్చినట్లుగానే అనిపిస్తోంది. ఆ ఫోటో అర్దం నిజంగానే పెళ్ళి ఫిక్స్ అయిందా లేక ఏదైనా మూవీ ప్రమోషనా అనేది నిహారిక కానీ మెగా ఫ్యామిలీ కానీ క్లారిటీ ఇచ్చేంతవరకు ఈ సస్పెన్స్ అనేది వీడదు.

https://www.instagram.com/p/CBidGnVJDBn/

శ్రీదేవి డబ్బుల కోసం కుట్ర జరిగింది : శ్రీదేవి మేనమామ

పిచ్చి కూతలు కూస్తే మాములుగా ఉండదు : శ్రీరెడ్డి

ఆఫర్స్ లేక అను ఇమ్మాన్యుయల్ ఏం చేస్తుందంటే ?

కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -