హీరో నాగశౌర్యపై పంచ్ వేసిన హీరో నితిన్..!

688
Nithin Punch on Young Hero
Nithin Punch on Young Hero

నాగ శౌర్య -వెంకీ కుడుముల కాంబోలో ఛలో సినిమా గతంలో వచ్చి మంచి హిట్ అయింది. అయితే తర్వాత వీరి మధ్య వచ్చిన మనస్పర్దాల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఇక ఇటీవలే నాగ శౌర్య.. ఛలో కథ వెంకీ ఒక్కడిదే కాదని స్క్రిప్ట్ లో తన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని చెప్పుకున్నాడు.

అంతేకాకుండా తనతో ఓ మూవీ చేద్దాం అనుకున్నాప్పుడు బాలేని ఓ కథతో వచ్చాడని.. ఆ టైంలో తను గైడెన్స్ ఇచ్చి ఛలో స్క్రిప్ట్ రాయించానని చెప్పాడు. సినిమా హిట్ అయ్యాక తనతో టచ్ లో లేకుండా తిరుగుతున్నాడని.. కారు గిఫ్ట్ గా ఇస్తే అమ్మేశాడని నాగశౌర్య ఓ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. దాంతో వీరిద్దరి మధ్య ఇష్యూ హాట్ టాపిక్ అయింది. అయితే ఇదే విషయంపై దర్శకుడు వెంకీ ఏం మాట్లాడకుండా సైలైన్స్ మైంటైన్ చేశాడు. ఇక భీష్మ సక్సెస్ మీట్ లో శౌర్య పేరు మరోసారి హైలైట్ అయింది.

అయితే ఈ సారి శౌర్యపై పంచ్ వేశాడు హీరో నితిన్. వెంకీ కుడుముల స్పీచ్ ఇస్తుండగా చివర్లో మైక్ తీసుకుని.. ఈ స్క్రిప్ట్ నీదేనా ? అంటూ కామెంట్ చేసాడు. దీంతో ఈవెంట్ లో నితిన్ పంచ్ హాట్ టాపిక్ అయింది. శౌర్య మీద నితిన్ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడంటూ చర్చ నడిచింది. సో ఏది ఏమైన సినిమా కథ పక్కనపెడితే అది అందిరికీ నచ్చేలా తెరకెక్కించడం కత్తిమీదా సాములాంటిదే. ఛలో కథ ను అందరికి నచ్చేలా వెంకీ తెరకెక్కించాడు. తర్వాత అతని గురించి శౌర్య నెగిటివ్ గా మాట్లాడకుండా ఉండాల్సిందని.. హిట్ అయింది కాబట్టి కథ తనదే అని చెప్పుకుంటున్నావు. అదే ప్లాప్ అయ్యి ఉంటే దర్శకుడి మీదకు తొసి ఉండేవాడివి కదా శౌర్య అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Loading...