Friday, March 29, 2024
- Advertisement -

హరితేజకి.. ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలుసా..?

- Advertisement -

హరితేజ.. ఈమె.. బిగ్ బాస్ కు రాకముందు.. బుల్లితెరపై చిన్న చిన్న షోస్ చేసుకుంటూ.. తన కెరీర్ ను కోససాగించింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఆమె కెరీర్ మంచి ఊపులో ఉంది. ప్రస్తుతం హరితేజ గురించే టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఓ ప్రముఖ టీవీలో వచ్చే వంట ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన హరితేజ.. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం కు బై చెప్పి.. సినిమల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ మూవీలో మంచి రోల్ చేసి.. అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈమెకు మంచి మంచి సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకు స్లోగా నటించిన ఆమె కెరీర్.. బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా.. మలుపు తిరిగింది. ఆమెలోని ప్రతి ట్యాలెంట్ ని బయటపెట్టడానికి ఈ షో వేదికైంది. ఆమె నటన, వ్యక్తితంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కూడా హరితేజ కి ఫ్యాన్ అయిపోయాడు.

అందుకే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత.. ఎవరు విన్నర్ అయినప్పటికి.. ఫలితంతో సంబంధం లేకుండా.. తన ప్రతి సినిమాలో హరితేజకి ఓ రోల్ తప్పకుండా ఇవ్వడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా తనకి తెలిసిన డైరెక్టర్ల సినిమాల్లోనూ పరితేజకి సరిపోయే పాత్ర ఉంటే ఇవ్వమని స్వయంగా అడగనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో అనుకుంటే అవకాశాలకు కొరవా.. ఇక బిగ్ బాస్ తర్వాత హరితేజ లైఫ్ పూర్తిగా మారిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -