Friday, April 19, 2024
- Advertisement -

నూతన్ నాయుడు మళ్లీ వస్తున్నాడా?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రెండు వారాలకే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన‌వారు మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే అవ‌కాశం క‌ల్పించ‌డంతో ,బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ ఆర్మీ నూత‌న్ నాయుడికి స‌పోర్టు చేయ‌డం ద్వారా మ‌ళ్లీ అత‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు.కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సమయంలో తన స్నేహితుడు కౌశల్ ని సపోర్ట్ చేయడం కోసం రోల్ రైడా పిరమిడ్ పై బంతులు విసిరాడు నూతన్.ఈ క్రమంలో అతడి భుజానికి తగిలిన గాయం కారణంగా అతడు హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ కోసం అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

బిగ్ బాస్ నిర్వాహకులకు మరొక ఆప్షన్ లేక అతడిని బయటకి పంపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి నూతన్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ వారంలోనే నూతన్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.నాని కూడా ఓ సందర్భంలో నూతన్ ఎలిమినేట్ అవ్వలేదని, అనివార్య కారణాల వలన అతడు హౌస్ నుండి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. దీంతో నూతన్ ఎంట్రీ ఖాయమని అంటున్నారు. ఇక నుత‌న్ నాయుడు రేపు (శ‌నివారం) నాని స‌మ‌క్షంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం.కామ‌న్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లి తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్న ఏకైక వ్య‌క్తిగా నూత‌న్ నాయుడు రికార్డు సృష్టించ‌బోతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -