ఒళ్లు మరిచి తాగి గొడవ పెట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్..!

1729
Once drunk Malaika Arora asked Sonam Kapoor to Back off in public
Once drunk Malaika Arora asked Sonam Kapoor to Back off in public

ఒళ్లు మరిచి.. ఫుల్ గా తాగడం.. తర్వాత చిందులేయడం అనేది బాలీవుడ్ లో చాలా కామన్ విషయం. అయితే అలా బాగా తాగి ఒళ్ళు మరిచిన మలైకా ఆ పార్టీలో ఇచ్చిన ట్విస్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ టైంలో ఆమెని ఆ ఇద్దరు అదుపు చేసి ఉండకపోతే.. తర్వాత మీడియాలో ఆమె గురించే రచ్చ జరిగేది.

ఇంతకీ ఆ పార్టీ సంగతి ఏంటి.. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే.. అప్పట్లో ముంబైలోని ఓ ఖరీదైన రెస్టారెంట్ లో మనీష్ మల్హోత్రా 50వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి వెళ్లిన మలైకా ఫుల్ గా తాగేసింది. దాంతో అదుపు తప్పి తూలి పడబోయిందట. దాంతో అక్కడే ఉన్న సోనమ్ కపూర్ ఆమెకు సాయం చేసేందుకు ట్రై చేసిందట. సాయం కావాలంటే నేనున్నాను! అంటూ సోనమ్ తనని వారించబోతే బ్యాక్ ఆఫ్ (వెనక్కి వెళ్లు) అంటూ సోనమ్ పై మలైకా గట్టిగానే అరిచేసిందట. నాకు నేను వెళ్లగలను.. నాకు ఎవరి సాయం అవసరం లేదు! అని మత్తుగా తూలిపోతూ అందిట.

చివరికి ఆ ఇద్దరి మధ్యకు మనీష్ – కరణ్ జోహార్ కల్పించుకుని గొడవ సద్ధుమణిగేలా చేశారట. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయ్యాయి. ఇక అప్పటికే మలైకా తన భర్త ఆర్భాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత ఇలా మందేయడంలో అదుపు తప్పిందిట. అప్పటికే అర్జున్ – మలైకా మధ్య ఎఫైర్ వార్తలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. ఆ ఇద్దరి ఎఫైర్ విషయంలో సమర్దించిన సోనమ్ కు ఇలా జరిగిందేంటి ? అంటూ బాలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు.

Loading...