వేధింపుల గురించి చెప్పిన ఐశ్వర్య రాజేష్..!

726
Once the heat has subsided the harassment is open
Once the heat has subsided the harassment is open

మీటూ ఉద్యమం ఎంత పెద్ద రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ నుంచి సౌత్ పరిశ్రమల వరకు ఈ మీటూ రచ్చ అట్టుడికించింది. సుచీలిక్స్.. వంటివి సంచలనం రేపాయి. ఆ నేపథ్యంలో పలువురు బడా స్టార్ల పేర్లు మీటూ వేదికగా బయటకు రావడంతో వారి పరువు పోయింది. అయితే ఈ మీటూ కారణంగా శిక్షకు గురైన వారి పేర్లు మాత్రం ఎవరికీ తెలియదు. బాలీవుడ్ లో నానా పటేకర్ సహా పలువురు నటులు.. దర్శకులు కోర్టుల్లో పోరాటం సాగించి ఏదోలా మొత్తానికి బయట పడ్డారు.

ఇక టాలీవుడ్ విషయంకు వస్తే.. పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు లోనైయ్యారని అప్పట్లో చెప్పారు. తాజాగా వెటరన్ నటుడు రాజేష్ కుమార్తె కౌశల్య కృష్ణమూర్తి ఫేం ఐశ్వర్య రాజేష్ ఈ తరహాలోనే వేధింపుల గురించి చెప్పడం ఇప్పుడు అందర్ని షాక్ కు గురి చేస్తోంది. కెరీర్ మొదట్లో కూడా తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఐశ్వర్య తాజా చిట్ చాట్ లో వెల్లడించింది. తనకు రంగు లేదని వర్ణ వివక్షకు గురయ్యానని తెలిపి షాకిచ్చింది. ముంబై – హిందీ భామలు తెల్లగా ఉండి.. అందాల ఆరబోతకు రెడీగా ఉంటారు.

ఆ విషయంలో సౌత్ భామలు వెనకబాటు గురించి చెప్పుకొచ్చింది ఐశ్వర్య. అందుకే తనకు ఆ తరహా వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. ఐశ్వర్య ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె. పైగా నటి శ్రీలక్ష్మికి కజిన్. అంత పెద్ద సినీనేపథ్యం ఉండీ వేధింపులు ఎదురవ్వడం షాక్ నిచ్చేదే. ఇంతకుముందు నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మి ఇదే తీరుగా బోల్డ్ గా తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఇక ఐశ్వర్య తమిళంలో ఇప్పుడు మంచి సినిమాల్లో నటిస్తూ ఇటూ తెలుగులో కూడా నటిస్తోంది. ఈమె ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది.

Loading...