Thursday, March 28, 2024
- Advertisement -

షాకింగ్ : ప్రభాస్ పారితోషికం 100 కోట్లు.. డార్లింగ్ రేంజ్ ఇది..!

- Advertisement -

స్టార్ హీరో వేరు.. పాన్ ఇండియా హీరో వేరు. వారి లెక్కలు వేరు. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ .. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు అప్పట్లో భారీ పారితోషికాలు తీసుకునేవారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ – మహేష్ లాంటి స్టార్లు ఈ కేటగిరీలో చేరారు. ఇప్పడు బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా ఇదే బాటలో వెళుతున్నాడు.

బాహుబలి తర్వాత సాహో లాంటి పాన్ ఇండియా మూవీలో నటించాడు. ఈ సినిమా హిందీలో మంచి సక్సెస్ అయింది. దాంతో అక్కడ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా లేవల్ లోనే రిలీజ్ చేస్తునారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కాకముందే.. ప్రభాస్ 21 సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కనుంది. ఈ మూవీని ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గట్టే ప్రభాస్ పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం.

ఇంతకీ ప్రభాస్ పారితోషికం రేంజ్ ఎంత అంటే..? డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందనుందని సమాచారం. అదీ ఒక సంవత్సరంలో సినిమా పూర్తి చేయాలి. లేకపోతే పారితోషికం పెరుగుతుంది. పారితోషికంతో పాటు సౌత్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ రైట్స్ లో 50 శాతం వాటా ఇవ్వాలి. సో మొత్తానికి నాగ్ అశ్విన్- అశ్వని దత్ సినిమాకి ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పడుకునే కి దాదాపుగా 18 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

44ఏళ్ళ వయసులో కూడా బాక్సింగ్ చేస్తున్న ప్రగతి ఆంటీ..!

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -