Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో అలరించనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో బుల్లి తెర పై వచ్చే షో ల మీద పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు కానీ ఒక బిగ్ బాస్ షో అంటే మాత్రం అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సారి షో కి సంబందించిన మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు అనే విషయం ఎంతగానో ఆసక్తి ని క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సారి షో లో సాధారణ ప్రజల ఎంట్రీ ఏమి లేదట. అందరూ సెలెబ్రిటీలనే తీసుకున్నారు నిర్వాహకులు. అంతే కాకుండా ఈ సారి షో లో ఎక్కువ గా మహిళలు ఉండేలా ప్లాన్ చేశారట.

షో కి సంబందించినంత వరకు కేవలం నాగార్జున హోస్ట్ గా ఉంటారు అనే ఒక్క విషయం మాత్రం బయటకు వచ్చింది. కానీ షో ఎప్పుడు మొదలవుతుంది, షో లో ఎవరు ఉంటారు అనే విషయాల మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే షో లో స్పెషల్ గెస్ట్స్ ఉంటారు అనే రూమర్స్ ప్రస్తుతం ఒప్పందుకున్నాయి.

ఈ సారి నిర్వాహకులు షో కోసం కొత్త నియమాలని పెడుతున్నారట. అలాగే వారి వ్యూహాల్లో భాగం గా వీకెండ్ కి నాగార్జున తో పాటు స్పెషల్ గెస్ట్స్ ని పిలుస్తారట, దానిలో భాగం గా పవన్ కళ్యాణ్ ని కూడా పిలవాలని నిర్వహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి రెండు సీజన్లలో పవన్ కళ్యాణ్ పేరు బాగానే వినిపించింది కానీ మూడో సీజన్ లో అయినా వస్తాడా లేదా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -