Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో శివ బాలాజీ విజయంకు కారణం ఎవరు..?

- Advertisement -

బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారాని ఆసక్తిగా ఎదురు చూడగా.. మొత్తనికి ఇటివలే జరిగిన.. ఎపిసోడ్ లో శివ బాలాజీ విజేతగా బిగ్ బాస్ నిర్ణయించారు. అయితే ఇప్పుడు సడెన్ గా పవన్ కళ్యాణ్ పేరు బిగ్ బాస్ షో వెనకల వినిపిస్తోంది. విచిత్రంగా అనిపిస్తోంది కదా.. అవును.. బిగ్ బాస్ తో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి లింక్ లేకపోయినప్పటికి.. ఇందులో పవన్ కీలక రోల్ పోషించినట్లుగా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.

ఈ కార్యక్రమంలో శివబాలాజీ విజేతగా నిలవడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కాటమరాయుడు మూవీలో పవన్ తమ్ముడిగా శివబాలాజీ నటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే.. పవన్ తో శివబాలాజీకి ఆత్మీయ సంబంధం ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ శివబాలాజీకి అనుకూలంగా భారీ సంఖ్యలో ఓట్లేయడంతో ఆయన విజేతగా నిలిచారన్నది టాక్. పవన్ ఇమేజ్ ను ఉపయోగించుకొని.. కొన్ని సినిమాలు కలెక్షన్లు రాబట్టుకున్న విషయం తెలిసిందే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ దానికి తాజా ఉదాహరణ. పవన్ దాని ఆడియో వెడుకకు కూడా వచ్చాడు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు పవన్ కళ్యాణ్ ను లింక్ పెట్టారు. పవనేమీ ఇన్వాల్వ్ కాకుండానే ఒక షో విజేతను పరోక్షంగా నిర్ణయించిన శక్తిగా పవన్ పేరు మోగుతోంది. ఇంకోవైపు.. బిగ్ బాస్ రియల్ అభిమానులు మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు.

రియాల్టీ షోలో శివ బాలాజీ ప్రతి గేమ్ బాగా ఆడాడు. ఆదర్శ్ కంటే శివ బాలాజా పాపులర్. ఆదర్శ్ కి అన్ని ఓట్లు వచ్చినపుడు కేవలం ఎనిమిది లక్షల ఓట్లు శివకు ఎక్కువ రావడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా పవన్ ఇంపాక్ట్ అన్న సమస్యే లేదంటున్నారు. ఈ విజయాన్ని పవన్ అక్కౌంట్లో వేయడానికి ఫ్యాన్స్ తెలివిగా ట్రై చేస్తున్నారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -