నితిన్ పెళ్లికి పవన్ వెళ్లొద్దు అంటున్న అభిమానులు.. కారణం ?

1416
pawan kalyan fans on nithiin marriage
pawan kalyan fans on nithiin marriage

హీరో నితిన్ పెళ్లి తేది మొత్తానికి ఫిక్స్ అయింది. నితిన్ తన పెళ్లిని ఏప్రిల్ లోనే గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే కరోనా కారణంగా అప్పుడు లాక్ డౌన్ రావడంతో పెళ్లి వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఐదు నెలలు కావొస్తున్న పరిస్థితులు సద్దు మనగలేదు. కరోనా తీవ్రత ఎక్కువైంది.

ఇప్పట్లో ఈ పరిస్థితి చక్కబడకపోవచ్చు అని భావించిన నితిన్ మరియు అతని కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. జులై 26న నితిన్ వివాహం ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అంత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. ప్రభుత్వ ఆంక్షల మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఈ పెళ్లి జరగనుంది. కాగా ఈ పెళ్లికి నితిన్ ఇప్పటికే సీఎం కేసీఆర్, ఇతర రాజకీయ నేతలు, సినీ సెలబ్రీటీలను ఆహ్వానించాడు. అందులో తనకు ఎంతో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ ను కూడా తన పెళ్లికి రావాలని పిలిచాడు. స్వయంగా నితిన్ పవన్ ని కలిసి పెళ్ళికి ఆహ్వానించడం జరిగింది. ఐతే నితిన్ పెళ్ళికి పవన్ హాజరు కావడం అభిమానులకు ఇష్టం లేదట.

దానికి కారణం కోవిడ్ వ్యాప్తి అని తెలుస్తుంది. హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ పెళ్లికి హాజరై రిస్క్ చేయడం ఎందుకని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. పవన్ కు నితిన్ వీరాభిమాని కావడం వల్ల పవన్ ఈ పెళ్లి తప్పకుండా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఫ్యాన్స్ మాత్రం పవన్ ను వెళ్లొద్దని అంటున్నారు. ఇక నితిన్ గత కొన్నాళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ 4 రాబోతుంది.. పాల్గోనే 15 మంది సెలబ్రిటీలు వీరే..!

నన్ను ఆ కేసులో ఇరికించింది అతనే : సుమన్

రష్మి‌ హగ్ నన్ను హగ్ చేసుకుంది.. అడ్డంగా బుక్ చేసిన సుధీర్..!

హీరోయిన్ తో ప్రేమలో ఉన్న హీరో ఆది పినిశెట్టి.. ఎవరామె ?

Loading...