Thursday, April 25, 2024
- Advertisement -

నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవన్ ఎందుకు రాలేదో తెలుసా ?

- Advertisement -

కొందరికి ఫంక్షన్స్ కి వెళ్లడం అంటే అసలు ఇష్టం ఉండదు. వారికి ఉండే ప్రాబ్లామ్స్ వారికి ఉంటాయి. ఇలాంటి కేటగిరికే చెందుతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనను నేరుగా ఏ ఫంక్షన్ లోనూ అభిమానులు చూసిందే లేదు. అరుదుగా వీరాభిమానుల కోసం మాత్రమే టైమ్ కేటాయిస్తుంటారు పవన్ కళ్యాణ్. ఇక తన ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ కి కూడా పవన్ కనిపించారు.

తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం జరిగింది. ఈ పంక్షన్ లో కూడా పవన్ కనిపించలేదు. నిహారిక-చైతన్య జంట నిశ్చితార్థం ఆల్బమ్ వెతికితే ఏ ఫోటోలోనూ పవన్ లేడు. అయితే పవన్ కు ప్రియ శిష్యుడు అయిన నితిన్ పెళ్లికి ముందు సెలబ్రేషన్స్ కి పవన్ వెళ్లాడు. కానీ సొంత ఫంక్షన్ అయిన నిహారిక ఎంగెజ్మెంట్ ఫంక్షన్ ని స్కిప్ కొట్టాడు. ఇక నిహారికకు పవన్ బాబాయ్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు జనసేన పార్టీకి నిహారిక ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫంక్షన్ కి పవన్ స్కిప్ కొట్టాడా లేక వేరే కారణం వల్ల రాలేకపోయాడా? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది. అయితే పవన్ ఊర్లో లేడని కొందరు అంటుంటే.. కరోనా కారణంగా పవన్ బయటకు రావడం లేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైన పవన్ వస్తాడని చూసిన ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది. ఇక ఈ వేడుకకు చిరంజీవి దంపతలతోపాటు రామ్ చరణ్, ఉపసాన, అల్లు అర్జు, స్నేహ, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి కుమార్తెలు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ పవన్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేయనున్నారట.

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

పవన్ కళ్యాణ్‌ మూవీలో పునర్నవికి ఛాన్స్.. ఏ పాత్ర అంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -