వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!

1110
pawan kalyan reaction on ram gopal varma
pawan kalyan reaction on ram gopal varma

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటారు. అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలానే ఆర్జీవి కూడా ఉంది. అయితే శ్రీరెడ్డి విషయంలో పవన్ ను వర్మ టార్గెట్ చేసిన విధానం, జనసేనను సోషల్ మీడియా సాక్షిగా ఎగతాళి చేయడం కానీ సర్వసాధారణ విషయం అయిపోయింది.

అయితే ఇప్పుడూ వర్మ చేష్టలు పవన్ కళ్యాణ్ కి నిజంగానే నవ్వు తెప్పిస్తున్నాయట. ప్రముఖల జీవితాలపై బయోపిక్ లు తీసి సంచలనాలు సృష్టించడంలో దిట్ట వర్మ. లాక్ డౌన్ టైంలో వరుస సినిమాలు చేస్తున్న వర్మ.. ’పవర్ స్టార్’ పేరుతో పవన్ లైఫ్ పై ఓ మూవీ తీస్తున్నాడు. ఇందులోని పాత్రలు ఓ వ్యక్తి మాదిరిగా ఉండటం యాదృచ్చికంగా జ‌రిగింద‌ట.

కొద్ది రోజులుగా ప‌వ‌ర్ స్టార్ చిత్రంలోని ప్ర‌ధాన పాత్రధారికి సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. వీటిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే పవర్ స్టార్ మూవీ పోస్టర్స్ పవన్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఆ పోస్టర్స్ చూసిన పవన్.. వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా చిన్న చిరునవ్వు నవ్వారట. పవన్ అభిమానులు మాత్రం వర్మని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కాగా.. ’పవర్ స్టార్’ మూవీకి ’ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అనేది ట్యాగ్ లైన్.

పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్‌

అనసూయ తొక్కేస్తున్న రష్మీ.. క్రేజ్ మాములుగా లేదు..!

ప్రభాస్ ’రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్..!

నా పెళ్లి గురించి మీకెందుకు.. : రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Loading...