Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. పవన్ తీసుకునే నిర్ణయాల్లో త్రివిక్రమ్ పాత్ర తప్పకుండా ఉంటుందని సినిమా పరిశ్రమలో చాలా మంది అంటూ ఉంటారు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయింది. అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ తో పాటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చేస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ ఇప్పటికే వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండగా రెండు రోజుల క్రితం అయ్యప్పునుమ్ కోషియుమ్ అనే మలయాళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమాకు పవన్ మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకత్వం వహించమని కోరాడని అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ ఆఫర్ కు నో చెప్పాడని సమాచారం. తనకు రీమేక్ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని త్రివిక్రమ్ సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించారని సమాచారం. పవన్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మరో పాత్రలో రానా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు అన్నీ పూర్తైన తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది.

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

ప్రభాస్ ’రాధేశ్యామ్’ మూవీ స్టోరీ లీక్..?

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -