Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కొడుకుని హీరోని చేసేది చరణే..!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఇందుకో కోసం అప్పుడే ప్లాన్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వెండితెరపై కనిపించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసే పనిలో ఉందట మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వారసత్వాన్నీ అకీరాతో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. పవన్ ఏ సినిమా చేసిన ఒక్కటే క్రేజ్. ప్లాప్స్ వచ్చిన ఆయనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గదు.

రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలను దూరం పెట్టాడు. ఇక మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తున్నారని కొన్ని రూమర్స్ వస్తున్నప్పటికి అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇక పవన్ కుమారుడు అకీరా నందన్ పెద్దవాదయ్యాడు. హీరోలా కనిపిస్తున్నాడు. దాంతో అకీరాను వెండితెరపై చూడాలని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరా సినీ ఎంట్రీపై పవన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందుకోసం రామ్ చరణ్ కు బాధ్యతలు అప్పగించారని టాలీవుడ్ టాక్.

తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి చిత్రం ఉండేలా చరణ్ స్కెచ్ వేశాడట. ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కు పండగే పండుగ. ఈ మధ్య సోషల్ మీడియాలో అకీరా నందన్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆరడుగుల బుల్లెట్ పాట అకీరాకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే అకీరా ఓ మరాఠీ చిత్రంలో నటించాడు. సో అకీరా తో చరణ్ ఎలాంతి చిత్రం తీస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -