నన్ను ఆంటీని చేశారు.. : పాయల్ ఆవేదన

2367
payal rajput serious director bobby
payal rajput serious director bobby

హీరోయిన్ పాయల్ తన గ్లామర్ తో కుర్రకారుకి పిచ్చేక్కించిన విషయం తెలిసిందే. డైనమిక్ పాత్రలతోపాటు హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌ కూడా చేసింది. అయితే వెంకీమామ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ కు పెద్ద అవకాశాలు రావడం లేదు. తన కెరీర్ నెమ్మదించడానికి కారణం ఓ డైరెక్టర్ అని తన సన్నిహితులతో పాయల్ చెప్పుకొన్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది.

విషయంలోకి వెళ్తే.. RX100 మూవీ తర్వాత పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో చేతికి చిక్కినా సినిమాలన్ని చేసింది. వెంకీమామ మూవీలో కూడా నటించింది. అయితే వెంకీమామ తన కెరీర్‌కు నష్టం జరిగిందనే మాటను తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడిందంట. ఆ సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రను చేయకపోవడంతో నిర్మాతలు తనను మరో విధంగా ఊహించుకొంటున్నారని చెప్పుకొన్నట్టు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం వెల్లడించింది. వెంకీ మామ డైరెక్టర్ పై పాయల్ కోపంగా ఉందట.

వెంకీమామలో వెంకటేష్ పక్కన నటించడం వల్ల తనకు యంగ్ హీరోల సరసన ఆఫర్స్ రావడం లేదని.. అలాగే తనని సినిమాలో అంటీలా చూపించారని పాయల్ బాధపడుతుందట. ఎఫ్2 లో వెంకటేష్ సరసన నటించిన తమన్నాను చాలా గ్లామర్‌గా చూపించారని, అదే క్రమంలో తన పాత్ర ఉంటుందని అనుకొన్నానని.. కానీ నా వయసుకు తగినట్టు కాకుండా ఆంటీలా తన పాత్రను మలిచారని.. అందుకే తనకు ఆఫర్స్ రావడం లేదని పాయల్ ఫీల్ అవుతుందట. ఇక ప్రస్తుతం పాయల్ తమిళ చిత్రం ఏంజెల్, తెలుగులో నరేంద్ర అనే చిత్రాల్లో నటిస్తోంది.

Loading...