సమంతను పూజా హెగ్డే అంత మాట అన్నదా ?

1243
Pooja Hegde official Instagram account hacked
Pooja Hegde official Instagram account hacked

నిన్న పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్టులో సమంతా ఫోటోకు “అంత ప్రెట్టీగా ఏం లేదు” అంటూ ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఉంది. అయితే ఈ పోస్ట్ పెట్టిన తర్వాత కొన్ని గంటలకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని.. ఇన్స్టాలో వచ్చిన పోస్టులను పట్టించుకోవద్దని కోరింది.

తన డిజిటల్ టీం ఈ విషయంపై వర్క్ చేస్తున్నారని చెప్పింది. కాసేపటి తర్వాత తన ఇన్స్టాగ్రామ్ కంట్రోల్ కి వచ్చిందని తెలిపింది. తన డిజిటల్ టీమ్ కు కృతజ్ఞతలు చెప్పింది. హ్యాకర్లను “థూ మీ బతుకు చెడ” అన్నట్టుగా ఇంగ్లీష్ లో తిట్టింది. అయితే పూజ ఇన్స్టా ఖాతా నిజంగా హ్యాకింగ్ అయిందా అని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమంతాపై ఏదో నోరు జారి కామెంట్ పెట్టావు.. సమంతా అంటే నీకు కుళ్లు అనే విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు కవరింగ్ చేసుకుంటున్నావా అంటూ కొందరు పూజపై విమర్శలు గుప్పించారు.

కొంతమంది అయితే ఈ విషయంపై మీమ్స్ పోస్ట్ చేస్తూ పూజను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు. ఈ పోస్ట్ నిజంగా పూజ చేసిందో లేక హ్యాకర్ల పనో తెలియదు కానీ ఎక్కువమంది మాత్రం “హ్యాకింగ్ కాదు.. పాడు కాదు ఇది పూజ కావాలని చేసింది” అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇకపై సెలబ్రిటీ తన ఖాతా హ్యాకింగ్ అయింది అని చెప్తే నమ్మేలా లేరు. ఏది ఏమైన పూజా ఖాతా నుంచి వచ్చిన ఈ పోస్ట్ వల్ల సమంత ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు.

Loading...