బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

1105
poonam bajwa remuneration for bigg boss 4
poonam bajwa remuneration for bigg boss 4

హీరోయిన్ పూనమ్‌ బజ్వా.. మంచి అందం, అభినయం ఉన్న నటి. అయినప్పటికి ఈ భామ టాలీవుడ్ లో అంత సక్సెస్ కాలేకపోయింది. 2005లో ‘మొదటి సినిమా’తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. యూత్ ని బానే ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు నటించింది ఈ అందాల భామ. ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.

దాంతో తమిళ్, మలియాళ సినిమాలతో బిజీ అయింది. టాలీవుడ్ లో పేరు తెచ్చుకోలేకపోయింది కానీ కోలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. లాస్ట్‌ ఇయర్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేసింది. వయసు మీద పడటంతో ఈ మధ్య కాలంలో ఈమెకు ఏ భాషలో కూడా ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. అయితే పూనమ్ ఇప్పుడు ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవ్వాలని చూస్తోంది. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌4లో ఓ కంటెస్టంట్‌గా బజ్వా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ ఇప్పటికే బజ్వాను సంప్రదించడం, ఆమె సంతకం చేయడం కూడా జరిగిపోయాయని సమాచారం. ’బాస్’ మూవీ నాగ్ సరసన రెండో హీరోయిన్ గా చేయడం ఆమెకు కలిసివచ్చిందని టాక్ నడుస్తోంది.

ఆమె వస్తే గత సీజన్లకంటే ఎక్కువ గ్లామర్, కలర్ తోడవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఈ షో కోసం పూనమ్ రెమ్యునరేషన్ ఎక్కువగానే డిమాండ్ చేసిందట. ప్రైజ్‌ మనీతో సంబంధం లేకుండా ఏకంగా 45 లక్షల పారితోషకం అడిగిందట. ఇక స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ ఆగస్టు సెకండ్‌ వీక్‌లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కంటెస్టంట్స్‌ జాబితా పూర్తయిందని, కరోనా నేపథ్యంలో వారిని 14 రోజుల ప్రీ క్వారంటైన్‌ కోసం రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. నాలుగో సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

ఈసారి ‘బిగ్ బాస్-4’లో వెళ్లేది ఈ కపులే..?

రష్మీని వదిలేసి వర్షిణితో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!

నితిన్ పెళ్లికి పవన్ వెళ్లొద్దు అంటున్న అభిమానులు.. కారణం ?

Loading...