Friday, April 19, 2024
- Advertisement -

సైరా మూవీలో ప‌వ‌న్ మాజీ ల‌వ‌ర్‌?

- Advertisement -

చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న సినిమా సైరా.ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం న‌గ‌ర శివార్ల‌లో జ‌రుగుతుంది.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం ప‌వ‌న్ మాజీ ప్రేయ‌సి అయిన పూన‌మ్ కౌర్‌ని తీసుకున్న‌ట్లు స‌మాచారం.కొద్ది రోజులు క్రితం ప‌వ‌న్‌కు నాకు మ‌ధ్య ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని,అత‌ని వ‌ల్లే మేం విడిపోయాం అని చెప్పి సంచ‌ల‌నం రేపింది.ప‌వ‌న్ వ‌ల్లే పూన‌మ్ కౌర్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించార‌ని అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి.దీంతో ఆమెపై ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయారు.

ఆమెకు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేశారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.మ‌రి పూన‌మ్ కౌర్ చిరంజీవి సినిమాలో న‌టిస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది అనుమానమే. ప్రస్తుతం ఆమె ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్ లో నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో కూడా హీరోయిన్ అక్క పాత్రలో కనిపించింది. మ‌రి ఇటువంటి పరిస్థితుల్లో పూన‌మ్‌ను సైరా టీం ఆమెను తీసుకుంటుందో లేదో చూడాలి.ఇక సైరా మూవీ టీజ‌ర్‌ను ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ నెల 21న విడుద‌ల చేయ‌నున్నారు.ఈ సినిమాను చిరంజీవి త‌న‌యుడు హీరో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.సైరా మూవీకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.సైరా మూవీని వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -