Saturday, April 20, 2024
- Advertisement -

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నాయి.. ఈ విషయాన్నీ ప్రభాస్ అభిమానులను సంతోష పరుస్తున్నా ఆ సినిమాలు వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుందన్నది వారి వాదన..  సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని రీ సూటి చేయిస్తున్నాడు ప్రభాస్.. అందుకే సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది.. రాధే శ్యామ్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమా చేయబోతున్నారు..

ఆ సినిమా తర్వాత ఆదిపురుష్ చేస్తున్నాడు..  ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

ఇక ఎటొచ్చి ఈ సినిమా లో సీత పాత్ర పై ఇంకా ఎవరికీ ఎలాంటి క్లారిటీ రాలేదు..  కీర్తి సురేష్ నుండి కియారా అద్వానీ వరకు ఎంతో మంది హీరోయిన్స్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఎవరు ఆదిపురుష్ సినిమాలో నటించబోతున్నారు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఈ సినిమా రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ అంటే సీత పాత్ర. కనుక సీత పాత్రకు ఎవరు అయితే బాగుంటుంది అనే విషయమై ఇప్పటికే యూనిట్ సభ్యులు ఒక క్లారిటీకి వచ్చారట. ఆ విషయాన్ని ఈ నెల చివరి వరకు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -