Friday, March 29, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ప్రనుష్క జంట?

- Advertisement -

ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంది. తెలుగు లో ఆలియా కి ఇదే మొదటి సినిమా. ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుందాం అని భావించినా ఆమె లాస్ట్ మినిట్ లో ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళింది. అప్పటి నుండి ఈ సినిమా లో నటీనటుల గురించి ఏదో ఒక రూమర్ మీడియా లో తిరుగుతూ నే ఉంది.

రాజమౌళి సినిమా అంటే పెద్ద స్పాన్ ఉంటుంది, అలాగే చాలా మంది పెద్ద నటులు కూడా ఇందులో నటించే అవకాశం ఉండటం తో అనేక రూమర్స్ వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా లో ప్రభాస్, అనుష్క అతిథి పాత్రలు చేయనున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. బాహుబలి సినిమా లో అలరించిన ఈ జంట ఇప్పుడు మళ్ళి ఆర్ఆర్ఆర్ లో కూడా అలరించబోతుంది అనే వార్తలు వచ్చాయి.

అయితే చిత్ర వర్గాలు మాత్రం ఇందులో నిజం లేదని, అదంతా అబద్ధం అని తేల్చి చెప్పేసాయి. ఇకపోతే ఈ సినిమా లో అజయ్ దేవగన్, సముద్రఖని కూడా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -