ప్రభాస్ కు ఘోరా అవమానం..!

1659
Prabhas Got Insulted In Tollywood
Prabhas Got Insulted In Tollywood

బాహుబలి సినిమా తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. అయితే రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా మొదటి రోజే 139 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ కు ఘోర అవమానం జరిగింది. సాహో సినిమా రిలీజ్ కు మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ ముందే వచ్చింది. అయితే దాని నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు వారు వేసిన తప్పు అడుగు ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో టీవీలో ప్రసారం చేసిన హక్కుల కోసం గతంలో చాలా మంది పోటీపడ్డారు దాదాపు 90 కోట్ల మేర మార్కెట్ వచ్చింది అయితే ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు అంత ధర పెట్టి కొనడానికి భయపడ్డారు కానీ హిందీలో మాత్రం ఓ ఛానల్ టీవీ ప్రసార హక్కులను కొనుక్కుంది. ఇక సాహో సినిమా తెలుగులో అనుకున్నంత లాభాలు తెచ్చిపెట్టే లేదు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత టీవీ చానల్స్ సాహోని కొనేందుకు వెనక్కి తగ్గాయి.

అదే సమయంలో డీజటల్ మీడీయా అమెజాన్ లో కూడా సాహో రిలీజ్ అయిపోయింది. దీంతో ఇప్పుడు రేటు తగ్గించిన కూడా ఏ తెలుగు టీవీ చానల్స్ కూడా కొనేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. ఏదేమైనా భారీ బడ్జెట్తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కొనడానికి ముందుకు రాకపోవడం నిజంగా ఘోర అవమానం చెప్పుకోవాలి.

Loading...