ప్రభాస్‌ పెళ్లి పై గుడ్ న్యూస్ వచ్చేసింది ?

2475
Prabhas Sisters Comments On Prabhas Marriage
Prabhas Sisters Comments On Prabhas Marriage

యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా రకరకల వార్తలు షికార్లు చేస్తున్నాయి. దాదాపుగా నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఆలోచించడం లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పెళ్లిపై గత ఐదు సంవత్సరాలుగా వార్తలు వస్తునే ఉన్నాయి.

ఎప్పటికప్పుడు ఆ వార్తలను ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యలు కొట్టిపారేస్తున్నారు. మిర్చి తర్వాత ప్రభాస్ పెళ్లి అన్నారు. ఆ తర్వాత బాహుబలి మొదలు పెట్టాం కాబట్టి ఈ సినిమా కంప్లీట్ చేశాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. బాహుబలి రెండు పార్టులు రిలీజ్ అయ్యాయి. అయిన పెళ్లి ఊసే లేదు. సాహో మొదలు పెట్టాడు. సాహో తర్వాత పెళ్లి అన్నారు. కానీ సాహో రిలీజ్ అయింది.. తన తదుపరి సినిమా జాన్ కూడా కంప్లీట్ కావొస్తోంది. కానీ పెళ్లి ప్రస్తావన అయితే లేదు.

ఈ సమయంలో ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు కూతురు.. అంటే ప్రభాస్ సోదరి ఈ విషయంపై స్పందించింది. ప్రభాస్‌ పెళ్లి గురించి సన్నిహితుల వద్ద ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అన్నయ్య ప్రభాస్ కోసం ఓ అమ్మాయిని చూశాం. వచ్చే ఏడాది కచ్చితంగా అన్నయ్య పెళ్లి ఉంటుందని ఆమె చెప్పింది. అయితే ప్రభాస్ చేసుకునే అమ్మాయి ఎవరు ? ఎక్కడ ఉంటుంది ? ఏం చేస్తుందనే విషయంపై ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కృష్ణం రాజు స్వయంగా అమ్మాయిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Loading...