Friday, April 19, 2024
- Advertisement -

కరోనాతో యాంకర్ ప్రదీప్ కు సమస్య ?

- Advertisement -

బుల్లితెరపై తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకున్నాడు యాంకర్ ప్రదీప్. దాదాపుగా పదేళ్లకు పైగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మెల్ యాంకరింగ్ లో ప్రదీప్ టాప్ లో ఉన్నాడు. అందుకే ఆయనకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. బుల్లితెర పై ఎన్నో షోలతో బిజీగా ఉంటూనే అడపాదడపా సినిమాలలో కన్పిస్తుంటాడు. అయితే రీసెంట్ గా ప్రదీప్ హీరోగా మారాడు.

ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం “30రోజులలో ప్రేమించడం ఎలా?”. ఈ నెలలో రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కోసం ప్రదీప్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన బజ్ తెచ్చాయి. ముఖ్యంగా ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా సెటిల్ అవ్వలాని ఆశలు పెట్టుకున్నాడు.

కానీ సడన్ గా కరోనా విజృంభించడంతో రిలీజ్ సినిమాలు అన్నింటికీ బ్రేక్ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా రిలీజ్ కి నోచుకోక పోవడంతో ప్రదీప్ చాలా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయినా ప్రదీప్ ఇప్పటికే సినిమా హీరోగా రావడానికి చాలా ఆలస్యం చేసాడని టీవీ అభిమానులు అందరూ భావిస్తున్నారు. మరి ప్రదీప్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -