Friday, March 29, 2024
- Advertisement -

ఆ కమెడియన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా.. : ప్రగతి

- Advertisement -

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగ మంచి పేరు సంపాధించుకుంది ప్రగతి. హీరోయిన్ కి ఏ స్థాయి గుర్తింపు ఉందో ఈమెకి కూడా అదే స్థాయి గుర్తింపు ఉంది. అయితే అమ్మ, అక్క, అత్త, పిన్ని వంటి పాత్రలు చేసి మెప్పించిన ఘనత ఆమె సొంతం. ఇప్పటికే ఈమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.

స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ కమెడియన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ప్రగతి ఆ కమెడియన్ పేరు చెప్పలేదు కానీ ఆ టైంలో ఆయన చాలా పెద్ద స్టార్ కమెడీయన్ గా బిజి బిజీగా ఉన్నాడు అని చెప్పింది. ఇక చిత్రంలో నటిస్తున్న టైంలో ఆ కమెడియన్ నాతో పదే పదే మాట్లాడేందుకు ట్రై చేయడంతో పాటు టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి మాటలు చేష్టలు నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి.

ఇక విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే నేను అతడితో మాట్లాడాను. ఒక రోజు షూటింగ్ ముగిసిన తర్వాత కారావ్యాన్ లోకి ఆయన్ను తీసుకు వెళ్లాను. మీ మాటలు.. మీ చేష్టలు ఏం బాలేవు.. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మీ ప్రవర్తన మార్చుకోకుంటే అసలు బాగోదు అని వార్నింగ్ ఇచ్చాను. దాంతో అతను సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన నాతో ఎప్పుడు కూడా చెడుగా ప్రవర్తించలేదు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే సరి చేసుకుంటే బేటర్ అని తోటి నటీమణులకు ప్రగతి సలహా ఇస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -