Wednesday, April 24, 2024
- Advertisement -

షూటింగ్ భూమికపై అరిచిన ప్రకాశ్ రాజ్.. ఎందుకు ?

- Advertisement -

సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ప్రకాష్ రాజ్ కు మంచి పేరు ఉంది. సినిమాల్లో స్ట్రాంగ్ విలన్ ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజ్ పేరు చెబుతారు. అన్ని రకల పాత్రలు చేసిన ఆయనకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇండస్ట్రిలో ప్రకాష్ రాజ్ కు కాస్త కోపం ఎక్కువ అనే టాక్ ఉంది. కొన్ని సదర్భాల్లో ఆయన షూటింగ్ ను వాకౌట్ కూడా చేశారు. కొన్ని సినిమాలకు మొదట్లో ఓకే చేసుకుని తర్వాత ఆయనను తొలిగించిన సందర్భాలు ఉన్నాయి.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వాస్తవాలను తెలుసుకోని రాజీ పడి సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతుండగా ప్రకాశ్ రాజ్ ఆవేశపడి అరిచినట్లు సమాచారం. ఓ సీన్ కు సంబంధించి షూటింగ్ లో బాలకృష్ణ, భూమిక, ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. ఆ టైంలో భూమిక తన పాత్రను సరిగ్గా చేయకపోవడంతో ఆమెపై ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచినట్లు సమాచారం.

దాంతో ఆశ్చర్యపోయిన కెమెరా మెన్ రాం ప్రసాద్.. షూటింగ్ స్పాట్ ’నీ ఇల్లు కాదు’ ఇష్టం వచ్చినట్లు అరవడానికి అని గట్టిగా సమాధానం ఇచ్చాడట. బాలయ్య కూడా కోపంగా చూశాడట. దాంతో ప్రకాశ్ రాజ్ ఆవేశంగా షూటింగ్ నుంచి నిష్క్రమించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే అలా వెళ్లిన ప్రకాశ్ రాజ్ ను బాలకృష్ణ కూడా బతిమాలలేదట. కాసేపటికి ప్రకాష్ రాజే కోపం తగ్గించుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -