ప్రతీరోజూ పండగే లో అసలే ట్విస్ట్ ఇదే..!

805
Prathi Roju Pandage Movie Shooting Update
Prathi Roju Pandage Movie Shooting Update

సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం ’ప్రతీరోజూ పండగే’. మారుతీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జి.ఏ.2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

మరణానికి దగ్గర పడుతున్న ఓ తాతయ్య కథ ఇదని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుది. ఓ తాతయ్య తన చివరి రోజుల్లో తన కుటుంబంతో కలిసి గడపాలని ఆశపడుతుంటాడు. దానికి మనవడు (సాయిధరమ్ తేజ్) సాయం చేస్తుంటాడు. అలా కుటుంబం అంతా మళ్లీ దగ్గరగా వస్తుంటారు. చివరికి తాతయ్య చనిపోయే ఈ సినిమా ట్రాజేడీ ఎండింగ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగదట.

ఇదంతా ఒంటరిగా జీవితం గడుపుతున్న తాతయ్య కోసం.. అతని విలువలు కుటుంబంలో వాళ్ళు అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనవడు ఆడించే డ్రామా అని తెలుస్తోందట. అసలు విషయం తన తాతయ్యకు కూడా తెలీదట. ఈ విషయం డాక్టర్ల ద్వారా తాతయ్యకు చెప్పిస్తాడట ఆ మనవడు. మరి ఈ లీకైన ఈ ట్విస్ట్ లో నిజమెంత తెలియలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Loading...