Friday, March 29, 2024
- Advertisement -

ప్రియమణి నాలుగేళ్ల కాపురం అనంతరం.. ఇప్పుడు పెళ్లి?!

- Advertisement -

తను ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నానని.. ఇతడిలో లివిన్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నానని ఆ మధ్య ప్రియమణి ఒక ప్రకటన చేసింది. అయితే అతడు ఎవరో ఇప్పుడప్పుడే చెప్పలేనని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. తను పెళ్లి చేసుబోతున్నానని వివరించింది. నాలుగేళ్ల కిందట అతడితో ప్రేమలో పడ్డానని.. ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నానని ఈ మలయాళీ భామ వివరించింది.

ప్రియమణి ప్రియుడి పేరు ముస్తఫారాజ్… ముంబైలో ఒక రియాలిటీ షో సమయంలో అతడు ఆమెకు పరిచయం అయ్యాడట. ప్రియమణి తొలి చూపులోనే అతడికి పడిపోయిందట. తెగించి తనే ప్రేమప్రతిపాదన చేసిందట. వారం రోజులకు కానీ సదరు ముస్తఫా సమాధానం ఇవ్వలేదట. చివరకు ఆమెప్రేమకు అతడు సమ్మతి తెలియ జేశాడట. అలా ప్రేమలో మునిగిన ఈజంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్టుగా తెలుస్తోంది.

మరి ప్రియమణికి ఇప్పుడు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమల్లో ఎక్కడా ఈ భామకు అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఎంచక్కా వివాహంచేసుకొని సెటిలయిపోవడమే మేలని ఈ భామ భావిస్తున్నట్టుగా ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -