పవన్ కళ్యాణ్‌ మూవీలో పునర్నవికి ఛాన్స్.. ఏ పాత్ర అంటే ?

723
Punarnavi Bhupalam To Team Up With Pawan Kalyan For Krish Movie?
Punarnavi Bhupalam To Team Up With Pawan Kalyan For Krish Movie?

పునర్నవి కి అదిరిపోయే ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మూవీలో నటించే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఆవకాశం పునర్నవికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారి తిరిగి పవన్ సినిమాల్లో నటించేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్.

1870 నాటి పరిస్థితుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఈ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఈ మూవీలో పవన్‌కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నటించనుంది. అప్పట్లో ఆచరణలో ఉన్న దేవదాసి వ్యవస్థను ఈ సినిమాలో చూపించబోతున్నారట క్రిష్. అయితే ఈ దేవదాసి పాత్ర కోసం బిగ్ బాస్ బ్యూటీ పునర్నవిని తీసుకున్నట్టు తెలుస్తోంది. పునర్నవి కూడా పవన్ సినిమా అనేసరికి వెంటనే ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

దేవదాసి పాత్ర అంటే ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. దక్షణ భారతదేశంలో ఈ దేవదాసి వ్యవస్థను ఓ సాంఘిక దురాచారంగా పరిగణిస్తారు. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం, పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి. గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీగా కూడా ఈ దేవదాసిలు ఉంటారు. దేవతలకు నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారంగా కూడా ఈ దేవదాసి వ్యవస్థ చరిత్రలో ఉంది. మరి క్రిష్ వీటిలో ఏ కోణాన్ని తీసుకుని పునర్నవిని దేవదాసిగా చూపిస్తారన్నేది చూడాలి.

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

Loading...