Thursday, April 18, 2024
- Advertisement -

తెరవెనుక చాలా జరుగుతాయి.. కనిపించవు : రాధికా ఆప్టే

- Advertisement -

ఎవరికి తెలియనివి చాలానే తెర వెనుక చాలా జరుగుతాయని.. అవన్ని బయటకు రావని సీనీయర్ హీరోయిన్ రాధికా ఆప్టె అంటుంది. ఈమె బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

అయితే చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులు మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీనీపై రాధికా స్పందించారు. మీటూ ఉద్యమం నేపథ్యంలో చాలా మార్పులు వస్తాయని తాను భావించానని.. కానీ ఎలాంటి మార్పు లేదని.. నిజానికి తెరవెనుక చాలా జరుగుతుంటాయని.. అవన్ని బయటకురావని చెప్పుకొచ్చారు. ఇది ఎంతో నిరాశపరిచే అంశమన్నారు.

అలానే సినీ ఇండస్ట్రీలో పురుషులకు, స్త్రీలకు చెల్లించే పారితోషికాల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమానత్వం అనేది ఇంకా రాలేదన్నారు. ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలలో నటించే నటీమణులకు… అదే తరహా సినిమాలలో నటించే హీరోలతో సమానమైన పారితోషికం ఇవ్వాల్సివుందన్నారు. ’ఏ’ సర్టిఫికెట్ సినిమాలో నటించే హీరోలు కోట్ల రూపాయల లబ్దిపొందుతారని అన్నారు. వారికి అధిక పారితోషకం ఇవ్వాల్సిందే.. అయితే వారితో పాటు మిగిలిన నటులు కూడా కష్టపడ్డారనేది గుర్తించాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -