నాపే అప్పుడే రేప్ జరిగింది.. షాకింగ్ నిజాలు చెప్పిన రాహుల్ రామకృష్ణ

1121
rahul ramakrishna reveals secrets of his life
rahul ramakrishna reveals secrets of his life

ప్రస్తుతం టాలీవుడ్ లోకి కొత్త కొత్త కమెడియన్స్ వస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఒక్కడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో ఫాంలోకి వచ్చిన రాహుల్.. తక్కువ కాలంలోనే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోనూ ముఖ్యపాత్ర పోషించాడు.

అయితే తాజాగా తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళ్తే.. తనపై చిన్నప్పుడే రేప్ జరిగిందని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకోవడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. “నా చిన్నతనంలో నేను రేప్‌కి గురయ్యా. నా క్షోభ ఏంటో ఎలా చెప్పాలో తెలియదు. జరిగిన విషయం మాత్రమే తెలుసు. ప్రతిదీ బాధిస్తూనే ఉంటుంది. నా బాధను ఎవరితో ఎక్కడ పంచుకోవాలో తెలీలేదు అందుకే ట్విటర్‌లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇలా ఇతరులతో పంచుకోవడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలుగుతున్నాను” అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీలో రాహుల్ రామకృష్ణ నటిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాహుల్ రోల్ కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. జులై 30న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Loading...