అషూరెడ్డితో రిలేషన్ షిప్ లో ఉన్నాను : రాహుల్ సిప్లీగంజ్

1198
rahul sipligunj opens up on his relationship with ashu reddy
rahul sipligunj opens up on his relationship with ashu reddy

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా ఉన్నప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన తర్వాత బాగా క్రేజ్ సంపాధించుకున్నాడు. హౌస్ లో ఉన్న పునర్నవితో క్లోజ్ గా ఉండటం.. పదే పదే శ్రీముఖితో గొడవ పడటంతో.. రాహుల్ వ్యక్తిత్వం ఏంటో అర్దం చేసుకున్న ప్రేక్షకులు అతనిపై అభిమానం పెంచుకున్నారు. దాంతో రాహుల్ కి విపరితమై ఫాలోయింఘ్ ఏర్పడింది. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా నిలిచాడు రాహుల్.

తర్వాత కూడా రాహుల్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో కూడా మనోడికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. అంతేకాకుండా రాహుల్ కు సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగ మార్తాండ’ సినిమాలో రాహుల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే మొన్నటి వరకూ పునర్నవితో రాహుల్ లవ్ లో ఉన్నాడని పెళ్లి కూడా చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అయిన అషూ రెడ్డితో రాహుల్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి రాహుల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

‘యస్.. అషూరెడ్డితో నేను రిలేషన్‌షిప్ లో ఉన్నాను’.. అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే ‘మా మధ్యన ఉన్నది ‘మీరు అనుకునే రిలేషన్ కాదు! అషూ నాకు ‘జిగిరీ దోస్త్ ‘ . అంటే ఎవ్వరూ విడదీయలేనటువంటి స్నేహితురాలు’ అంటూ అషూ ని ట్యాగ్ చేసాడు. రాహుల్ పెట్టిన ఈ కామెంట్‌కు అషూ.. ‘లవ్ ఎమోజీని’ పెట్టింది. దాంతో నెటిజన్లు మాత్రం పునర్నవితో మీ జోడి బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

11ఏళ్లు చిన్నోడే.. కానీ ఆ పనిలో మాములోడు కాదు : మలైకా

బ్రహ్మానందం సినిమాలకు గుడ్‌ బై ?

తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు..!

సురేఖ, హేమ.. తమ కూతుర్ళతో క్యాష్ షోలో రచ్చ..!

Loading...