Tuesday, April 16, 2024
- Advertisement -

రాహుల్ కు దెబ్బ కొట్టేందుకు ప్లాన్.. ఎవరు ?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో చివరి వారంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పేరిగింది. తాజా ఎపిసోడ్ లో శివజ్యోతి ఎలిమినేట్ అయింది. ఇప్పుడు హౌస్ లో ఉన్నవారిలో రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా మాస్టర్ల మధ్య మంచి పోటీ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీముఖి, రాహుల్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

ఈ క్రమంలో రాహుల్ ఎలాగైన విన్నర్ కావాలని అతని ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ రాహుల్ యాంటి ఫ్యాన్స్ మాత్రం అతనికి టైటిల్ దక్కకుండదు అని భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తొలి సీజన్ లో రాహుల్ పాటని హౌస్ లో ప్లే చేయడం జరిగింది. దానిపై రాహుల్ కాస్త గట్టిగానే విమర్శించాడు. ఇప్పుడు ఆ వీడియోలను ట్రోల్ చేస్తూ రాహుల్ కు టైటిల్ దక్కకుండా చేసేందుకు కొందరు కుట్ర పన్నారని అర్దం అవుతోంది. రాహుల్ కి ఇప్పుడు బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ కు ఉన్నంత క్రేజ్ ఉంది.

అతనికే ఎలాగైన టైటిల్ వస్తుందని 60 శాతం మంది అంటున్నారు. ఇలాంటి టైంలో రాహుల్ పాత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతని క్రేజ్ ఎలాగైన తగ్గించాలని రాహుల్ యాంటి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ ఫ్యాన్స్ మాత్రం కావాలనే శ్రీముఖి ఫ్యాన్స్ ఇలా రాహుల్ ను ట్రోల్ చేస్తున్నారని యాంటి ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక టైటిల్ రాహుల్ లేదా శ్రీముఖికి దక్కే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -