మహేష్ అంటే రాజమౌళికి లెక్కలేదా ?

650
Rajamouli and Mahesh babu Twitter Issue
Rajamouli and Mahesh babu Twitter Issue

సినిమా పరిశ్రమలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. దర్శకుళ్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా మొదలు కావడం ఆలస్యం.. అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచానాలు తెగ ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మాస్ యాక్షన్ సినిమాగా అనిలీ రావుపూడి తెరకెక్కిస్తున్నాడు.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా బాహుబలి తర్వాత RRR సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మహేష్, రాజమౌళి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మహేష్ తన సినిమాల గురించి చెబుతూనే ఇతర సినిమాల గురించి.. ఇతర సెలబ్రిటీల బర్తెడ్ లకు కూడా విష్ చేస్తుంటారు. రాజమౌళి కూడా ఇదే విధంగా చేస్తుంటారు. తాజాగా రాజమౌళి బర్త్ డే కి మహేష్ బాబు విష్ చేశాడు. కానీ రాజమౌళి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

కానీ చంద్రబాబు నాయుడు విష్ చేస్తే వెంటనే ఆయనకు థ్యాంక్యూ సర్ అని రిప్లయ్ చెప్పాడు. ఇక మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ లో అతి కొంది మంది వ్యక్తులనే ఫాలో అవుతున్నారు. అందులో రాజమౌళి కూడా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఇతర హీరోలని ఫాలో అవుతున్నాడు కానీ మహేష్ బాబుని మాత్రం ఫాలో కావడం లేదు. మహేష్ లాంటి హీరోతో రాజమౌళి సినిమా తీస్తే అది ఎలాంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ మహేష్ లాంటి హీరో విష్ చేస్తే కనీసం రిప్లయ్ ఇవ్వకపోవడంపై మహేష్ ఫ్యాన్స్ రాజమౌళిపై మండిపడుతున్నారు.

Loading...