Friday, April 26, 2024
- Advertisement -

హాలీవుడ్ రీమేక్ పై కన్నేసిన రాజశేఖర్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో గరుడవేగ అనే సినిమా తో తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన రాజశేఖర్ ఆ తర్వాత కల్కి అనే సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక పోతే తన తదుపరి చిత్రం ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్న తరుణం లో రాజశేఖర్ కి మాత్రం ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఒక వైపు ప్రవీణ్ సత్తారు గరుడవేగ అనే సినిమా కి రెండో భాగం చేయాలనీ చూస్తున్నారు. మరో వైపు రాజశేఖర్ ఒక హాలీవుడ్ సినిమా ని తెలుగు లో చేయాలని ఆలోచిస్తున్నారట.

ప్రవీణ్ సత్తారు తో గరుడవేగ సినిమా మొదలు అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది అని, ఆ లోపే ఒక హాలీవుడ్ సినిమా ని తెలుగు లో చేయాలని భావిస్తున్నారు రాజశేఖర్. అయితే ఈ సినిమా రైట్స్ కొని అధికారికం గా చేయాలా లేక పాయింట్ ని ఎత్తేసి తెలుగు లో వీళ్లకి నచ్చినట్టు గా మార్చేసి చేయాలా అనే ఆలోచన తో ఉన్నారట. ఈ సినిమా ని కూడా కల్కి నిర్మించిన సి కళ్యాణ్ చేయాలనీ అనుకుంటున్నారు. కాకపోతే ఇంకొద్ది రోజులు అయితే కానీ రాజశేఖర్ తన తదుపరి సినిమా పైన క్లారిటీ ఇవ్వరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -