Saturday, April 20, 2024
- Advertisement -

సుమ రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన రాజీవ్..!

- Advertisement -

యాంకర్ సుమ.. ఈ పేరు తెలియని వారు ఉండరు. బుల్లితెరపై టాప్ యాంకర్ గా పెరు తెచ్చుకుంది సుమ. ఆమె ఏ షో చేసిన అది సూపర్ హిట్. ఆమె ఏ ఆడియో ఫంక్షన్ కు వెళ్లిన అక్కడ సందడి సందడే. స్టార్ హీరోలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకలు ఇలా ఏం చేయాలన్న అక్కడ సుమ ఉండాల్సిందే. ఇక టెలివిజన్ రంగంలో కూడా దూసుకెళ్తూనే ఉంది.

తినడానికి కూడా టైం లేనంత బిజీగా సుమ ఉంటుంది. అయితే గతంలో సుమ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకల వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో తాజాగా సుమ రెమ్యూనరేషన్ గురించి ఆమె భర్త రాజీవ్ కనకాల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. “అసలు సుమ చాలా షోస్ చేస్తుందని కదా.. బాగా సంపాధిస్తుంది అనుకుంటున్నారేమో.. తనకు వచ్చేది తక్కువేనని.. ఇన్ని ఏళ్లుగా షూటింగ్ లో పెద్ద పెద్ద లైట్స్ మధ్య కష్టపడుతూ వచ్చిందని చెప్పారు.

అలానే తన వెనుక నేను ఉన్నానని అనుకుంటారు. కానీ నిజానికి అందంతా ఆమె టాలెంట్ మాత్రమే. నేను కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను. క్రెడిట్ అంత తనదే. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు తన రెమ్యునరేషన్ ఎంతో కూడా తనకు తెలియదనీ.. మేము అసలు రెమ్యునరేషన్ గురించి ఇంట్లో ప్రస్తావించమని చెప్పాడు. సుమకు స్పెస్ ఇస్తానని.. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని” రాజీవ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -