Friday, April 19, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్‌కి నో చెప్పిన‌ ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్‌

- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెర‌కు పరిచిమైంది పాయ‌ల్ రాజ్‌పుత్‌.ఈ సినిమాలో అమ్మ‌డి బోల్ట్‌నెస్ యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.దీంతో ఆమెకి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం సెలెక్టెడ్ కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటు తన కెరీర్‌ను మ‌లుచుకుంటుంది.తాజాగా రాజ్‌పుత్ ఓ స్టార్ హీరో సినిమాని తిరస్కరించింది. అఖిల్-వెంకీ అట్లూరి సినిమాలో చిన్న రోల్ లో నటించమని అడిగితే నో చెప్పింది.

తేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ని తిరస్కరించింది. తాజాగా ఆమె రామ్ చ‌ర‌ణ్ -బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని పాయల్ ని సంప్రదించగా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తుంటే రాజ్‌పుత్ పాయ‌ల్ మాత్రం ఐటెం సాంగ్స్ చేయ‌న‌ని అన‌డం గ‌మ‌న‌ర్హం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -