Thursday, March 28, 2024
- Advertisement -

గీత గోవిందంకు నో చెప్పా.. సెక్స్ కావాలని అడిగాడు : రకుల్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం టైం పెద్దగా కలిసిరావడం లేదు. స్టార్ హీరోల సరసన నటించి వరస హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయాలు లేక బాధపడుతోంది. చివరగా మన్మథుడు 2 లో నటించింది. కానీ ఈ చిత్రం కూడా ఊహించని ప్లాప్ అయింది. అంతేకాకుండా రకుల్ లుక్స్, అప్పియరెన్స్ కు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా రకుల్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు తాము చేయాల్సిన సినిమాలు తప్పని పరిస్థితుల్లో వదులుకుంటూ ఉంటారు. అవే సినిమాలు కొన్ని సార్లు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం రకుల్ కుడా అలాంటి గొప్ప ఛాన్స్ ను మిస్ చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో గీతగోవిందం సినిమా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమాలో విజయ్ కంటే హీరోయిన్ గా చేసిన రష్మీకకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమె తన నటనతో అదరకొట్టింది. అయితే ఈ సినిమా లో రష్మీక పోషించిన పాత్రను రకుల్ వదులుకుందట.

ఆ టైంలో ఆమె బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ సినిమాకు ఒప్పుకోవడంతో డేట్లు లేక చేయలేకపోయిందట. అయితే సినిమాని మిస్ చేసుకున్నందుకు కాస్త బాధగానే ఉన్నప్పటికి.. కనీసం ఓ చిన్న రోల్ చేసిన బాగుండేది అనిపించిందని రకుల్ చెప్పింది. ఇక ఇండస్ట్రీలో తనతో కలిసి నటించిన ఓ హీరో సెక్స్ కావాలని కూడా అడిగాడని.. అయితే క్యాస్టింగ్ కౌచ్ లా అసభ్యకరంగా అడగలేదని.. మర్యాదపూర్వకంగానే అడిగాడని చెప్పింది. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని.. అందుకే నో చెప్పేశానని చెప్పుకొచ్చింది రకుల్. ఇంతకీ ఆ కో స్టార్ ఎవరా ? నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -