Friday, March 29, 2024
- Advertisement -

రకుల్ ప్యాంటు వేసుకోలేదని ట్రోల్స్.. ఫైర్ అయిన రకుల్..!

- Advertisement -

గతేడాది నుండి సోషల్ మీడియా లో ఎక్కువ ట్రోల్ అవుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటు సినిమాల్లో ఛాన్స్ లు ఎక్కువగా రావడం లేదు.. అటు సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురు అవుతున్నాయి. రకుల్ సినిమాల ద్వారా ఎంత స్టార్ డమ్ సంపాధించుకుందో.. ఫోటో షూట్ల తో అంతే ట్రోలింగ్ కు గురవుతోంది. ఈ మధ్య జనాలు ఘోరంగా తయారయ్యారంటూ తన సోషల్ మీడియాలో జరిగిన అవమానాలను చెప్పింది రకుల్. ఆ మధ్య ఒక ఫోటో షూట్ కోసం బ్లూ బ్రూలేట్ జీన్స్ వేసుకుంది రకుల్.

ఆ జీన్స్ చిన్న సైజ్ లో ఉండి జిప్ పెట్టుకోవడం మర్చిపోయిందట. దాంతో ట్రోల్ చేసేవారికి దొరికిందే సందు అన్నట్లు ఆ జిప్ పై ఏవేవో కథనాలు అల్లేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసారు. ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి సెలెబ్రిటీలను ఇబ్బందులకు గురిచేయడం మామూలైంది అనుకోని ఊరుకుంది. మరోసారి కారులో నుండి దిగుతుండగా ప్యాంటు వేసుకోలేదని దారుణంగా ట్రోలింగ్ చేసారు.

ఆ ఫోటో పై చేసిన కామెంట్లు అయితే మరీ దారుణం అంటూ రకుల్ వాపోతుంది. సెలబ్రిటీలు ఎన్నిసార్లు సహనంగా ఉండాలనుకున్న కొందరి కామెంట్స్ కారణంగా ఆ సహనాన్ని కోలిపోతారని.. తనకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యయని రకుల్ చెప్పింది. ఇలా దారుణంగా ట్రోల్ చేసేవారు ఉన్నంత కాలం మహిళలకు రక్షణ లేకుండా పోతుందని.. దయచేసి ఇలాంటి ట్రోల్స్ చేయకండి అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -