Tuesday, March 19, 2024
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ లీక్: రామ్ చరణ్, ఆలియా భట్ లుక్స్..!

- Advertisement -

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడినప్పటికి ఏదో ఒక రూపంలో లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి రామరాజుగా నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ నటిస్తోంది.

రామరాజుగా రామ్ చరణ్, సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ ఇలాగే కనిపించనున్నారంటూ, ఓ రెండు చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఎప్పుడో పాతకాలంలో తీసిన ఫోటోలుగా కనిపిస్తున్నాయి. వీటిని సినిమా కథానుసారం, ఫైల్ ఫొటోలుగా వినియోగించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలో రామ్ చరణ్ బ్రిటీష్ సైనిక అధికారి దుస్తుల్లో కనిపిస్తున్నాడు.

అయితే అల్లూరి సీతారామరాజు తన జీవితంలో బ్రిటీష్ అధికారిగా పని చేయలేదు. మరి ఈ ఫోటో వెనుక ఉన్న రహస్యం ఏంటో సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ చీరలో కనిపించింది. ఆర్ఆర్ఆర్ గురించి ఏ వార్త బయటకు వచ్చిన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -