Friday, March 29, 2024
- Advertisement -

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

- Advertisement -

నేడు (అక్టోబర్ 10) టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు. ఆయన నేడు తన 48వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమౌళి తన కెరీర్ లో ఓటమినే చూడలేదు. రాజమౌళి మొదట్లో టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఆ తర్వాత 2001లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్ కొట్టాడు. ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అన్ని సూపర్ హిట్లే.

అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి దేనికవే ప్రత్యేకమైనవి. ఇకపోతే బాహుబలితో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కూడా రాజమౌళిదే. మగధీర చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుతో పాటు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న భారీ సినిమా RRR. ఈ సినిమాలో హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. రాజమౌళి బర్త్ డే కి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కోట్లల్లో ఉండే వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. మరి అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. ఏది ఏమైన రాజమౌళి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలియజేద్దాం.

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

స్కైప్‌కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

బెల్లంకొండ చిన్నోడిని పక్కన పెట్టేశారా..ఆరంభ శూరత్వమేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -