Wednesday, April 17, 2024
- Advertisement -

చిరు 152వ మూవీలో చరణ్ చేసే పాత్ర ఇదే..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం మూవీ షూటింగ్ జరుపుకున్న రంగస్థలం గ్రామం సెట్ లోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి షూటింగ్ చేస్తున్నారట. అక్కడే దాదాపుగా రెండు నెలలు పాటు షూటింగ్ చేయబోతున్నారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరు మూవీలో చరణ్ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు చిరంజీవి యంగ్ ఏజ్ పాత్రలో చరణ్ కనిపిస్తాడని.. ఇద్దరి కాంబోలో సీన్స్ ఉండవని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరి కాంబోలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవి ఆచార్యగా కనిపిస్తే చరణ్ సిద్దు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరి కాంబో సీన్స్ ను చాలా రహస్యంగా చివర్లో షూట్ చేసే ఉద్దేశ్యంలో దర్శకుడు ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది.

ఈ మూవీలో చరణ్ ది కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే. మెగా ఫ్యాన్స్ కు చిరు.. చరణ్ లను ఒకేసారి వెండి తెర పై చూస్తే పండుగే. కొరటాల శివ ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ను చిరంజీవి ఖాతాలో వేయడం ఖాయం అంటూ మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఆగస్టులో లేదంటే దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -