Friday, March 29, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ సంస్థ‌లో ఎన్టీఆర్ ..?

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ,యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో యాక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు.రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అవ్వ‌గానే రాజ‌మౌళి సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది.సినిమాను వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రారంభించే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.అయితే ఎన్టీఆర్‌తో మ‌రో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.కాక‌పోతే ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌కుండా నిర్మిస్తాడ‌ట‌.త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన కొణిదల ప్రొడక్షన్‌లో ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా తీయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడ‌ట రామ్ చ‌ర‌ణ్‌.

రామ్ చ‌ర‌ణ్ అడిగితే ఎన్టీఆర్ చేయ‌కుండా ఉంటాడా?.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మరొకరూ వెళ్తూ.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేస్తూ తమ మధ్య బాండింగ్ గురించి చెప్పకనే చెబుతున్నారు.ఈ ప్రాజెక్ట్ గనుక సెట్స్‌పైకి వెళ్తే.. మెగా-నందమూరి అభిమానుల మధ్య సందడి మాములుగా ఉండదు. మ‌రి ఈ వార్త నిజం అయితే బాగుండు అని ఇద్ద‌రి హీరోల అభిమానులు ఆశ ప‌డుతున్నారు. వీరిద్ద‌రు అనుకుంటే స‌రిపోదు.రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ,ఎన్టీఆర్ హీరోగా అంటే సినిమాపై అంచ‌నాలు భారీగా ఉంటాయి.మ‌రి ఈ సినిమాకు మంచి క‌థ కుద‌రాలి.ఆ క‌థ‌ను తెర‌కెక్కించే మంచి ద‌ర్శ‌కుడు కావాలి.మ‌రి ఇవ్వ‌ని కుదిరిన త‌రువాతే సినిమా ప‌ట్టాలు ఎక్కుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -