ఆచార్యలో రామ్ చరణ్ పోషించే పాత్ర ఇదే.. ?

649
Ram Charan Role In Acharya
Ram Charan Role In Acharya

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ’ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచేసింది. చిరుకు దర్శకుడు కొరటాల శివ కథ చెప్పేటప్పుడే సినిమాలో ఒక కీలక పాత్ర గురించి చెప్పాడట. చిరంజీవి కథ ఓకే చేయడానికి ఈ పాత్ర కూడా ఒక కారణమని తెలుస్తోంది.

అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం మీద చాలా రకల వార్తలు వచ్చాయి. మహేష్ కి ఈ పాత్ర నచ్చి ఓకే చేసినట్లు వార్త వచ్చింది. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు మహేష్ ఆచార్య సినిమాలో నటించడం లేదని అనుకుంటున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పుడు రామ్ చరణ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా ఇదే కంఫర్మ్ అని సమాచారం. ఇప్పుడు రామ్ చరణ్ పాత్రకి సంభందించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో చరణ్ ఈ మూవీలో కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చిత్ర కథను మలుపు తిప్పుతుందట. ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తోనే ఆచార్య తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట.

సినిమాలో దాదాపు 30 నిమిషాలు నిడివి ఉండే ఈ క్యారెక్టర్ చనిపోతుందని సమాచారం. రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాకుండా ఒక సాంగ్ లో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటిస్తారంట. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. తండ్రీకొడుకు నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి మరి. ఆర్ ఆర్ ఆర్ లో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసి ఆచార్య మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Loading...