Friday, April 19, 2024
- Advertisement -

నేను పెళ్లి చేసుకుంటే నా భార్యకు పనిష్మెంట్ పడింది : వర్మ

- Advertisement -

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఆయనకు ఉన్న టాలెంట్ తో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎవరికైన జవాబు చెప్పగల సత్తా ఆయనకు ఉంది. ఆయన అనుకుంటే అది కచ్చితంగా చేసి తీరుతారు. అయితే ఆయన బంధాలు, భగవంతుడిని నమ్మనని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పే వర్మ అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ? ఓ ఆడపిల్లకు ఎలా జన్మనిచ్చాడు అంటే దానికి కూడా వర్మ దగ్గర సమాధానం ఉంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మారక ముందే రత్న అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన ఫస్ట్ సినిమా శివ చిత్రీకరణ సమయంలో వర్మకు కూతురు పుట్టింది. భార్య, పిల్లలు సంసారం గురించి అడిగితే వర్మ చెప్పిన సమాధానం..”తెలియని వయసులో ప్రేమ వివాహం చేసుకున్నాను. నాకు మనుషులతో బంధాలు ఏర్పరుచుకోవడం ఇష్టం ఉండదు. నన్ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమెకు తెలిసింది నేను చాలా సెల్ఫిష్ అని. పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు, దానికి పనిష్మెంట్ మాత్రం నా భార్య అనుభవించింది.

ఇక నాకూతురు పుట్టినప్పుడు ఎవరో కంగ్రాట్స్ చెవితే వింతగా అనిపించింది, ఎవడైనా తండ్రి కాగలడు.. దానికి కంగ్రాట్స్ ఏమిటని అనిపించింది. అమెరికాలో ఉన్న నా కూతుర్ని నేను కలవను,తను నన్ను జూలో జంతువులా చూస్తుంది. అలా నన్ను ఓ జంతువులా భావించే వారు నాతో రిలేషన్ ఎంజాయ్ చేస్తారు. మనుషులతో అవసరం ఉంటే తప్పా నాకు వాళ్ళు గుర్తుకురారు. నేను సెల్ఫిష్ మాత్రమే కాదు, సెల్ఫ్ సెంటర్డ్” అని వర్మ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -