Friday, March 29, 2024
- Advertisement -

అప్పుడు నో…. ఇప్పుడు యస్

- Advertisement -

ఎనర్జటిక్ హీరో రామ్…. అప్పట్లో రఘువరన్ బిటెక్ గా మారనన్నాడు. ఎందుకని అడిగితే….అరవ ఫీల్ మిస్ అవుతుందంటూ ప్రక్కకు తప్పుకున్నాడు.కాని ఈసారి మళయాల తీరం నుంచి వచ్చిన ప్రేమమ్ చిత్రాన్ని మాత్రం చేస్తానంటున్నాడు.

మరి కోలీవుడ్ లో ఫీల్ మిస్ అవుతుందని చెప్పిన రామ్… ప్రేమమ్ చిత్రాన్ని టేకప్ చేస్తే..మళయాల ఫీల్ మిస్ కాదని ఎందుకనుకుంటున్నాడు.

ఇపుడిదే విష‌యాన్ని ప‌రిశ్రమ‌లోని వారంతా అడుగుతున్నారు. ర‌ఘువ‌ర‌న్ బిటెక్ లాంటి సినిమా చేప్తే ఆ ఫీల్ మిస్ అవుతుంద‌ని చెప్పావ్. మ‌రి ప్రేమ‌మ్  చిత్రం బాల్యం నుంచి అన్ని ద‌శ‌ల్లోను హీరో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడ‌నే కాన్సెప్ట్ తో తీశారు క‌దా.ఇంత గొప్ప  చిత్రాన్ని రీమేక్ చేస్తే ఫీల్ ఎందుకు మిస్ కాదో చెప్పమంటున్నారు. 

ఇంకొందరు చెప్పేదేంటంటే…. ర‌ఘువ‌ర‌న్ బిటెక్ కోలీవుడ్ సినిమా క‌దా.ప్రేమ‌మ్ మాలీవుడ్ సినిమా. ఒక వేల ప్రేమ‌మ్ కూడా కోలీవుడ్ వెంచ‌ర్ అయ్యి ఉంటే ఫీల్ మిస్ అవుతుంద‌నే ప‌దాన్ని వాడేవాడేమో అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -