Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ టీజర్ లో రాజమౌళి కాపీ కొట్టాడు..!

- Advertisement -

బాహుబలి 2 సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా నుంచి రామరాజు ఫర్ భీమ్ పేరుతో ఎన్టీఆర్ టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిన్న ఉదయం విడుదలైన ఈ టీజర్ కు 13 మిలియన్ల వ్యూస్, 9 లక్షల లైక్స్ వచ్చాయి. అయితే రాజమౌళి గత సినిమాలలోని కాపీ సీన్స్ ఆరోపణలు వినిపించినట్లుగానే ఈ సినిమా విషయంలో కూడా కాపీ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

టీజర్ లో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా చూపించే సీన్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛాన‌ల్ లోనిది అని.. 9 నెలల క్రితమే ఆ ఛానల్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేసిందని తేలింది. మరికొన్ని షాట్లు కూడా వేర్వేరు వీడియోల నుంచి సేకరించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రామరాజు ఫర్ భీమ్ టీజర్ కాపీ ఆరోపణల విషయంలో జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

లాస్య రెండు సార్లు పెళ్లిపై ఏమన్నాదో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -