Saturday, April 20, 2024
- Advertisement -

అనసూయ తొక్కేస్తున్న రష్మీ.. క్రేజ్ మాములుగా లేదు..!

- Advertisement -

ఏ రంగంలోనైన పోటీ అనేది తప్పనిసరి. అయితే యాంకరింగ్ రంగంలో పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బుల్లితెరపై ఫిమేల్ యాంకర్స్ తమ సత్తా చాటుతున్నారు. ఒక్కప్పుడు లేడీ యాంకర్స్ అంటే పద్దతిగా కనిపించేవారు. ఇప్పుడు గ్లామర్ గా కనిపిస్తూ చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపిస్తున్నారు. అయితే కాలంతో మారుతూ వస్తున్నారు. . ఈ క్రమంలో ప్రెజెంట్ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న లేడీ యాంకర్స్ మధ్య పోటీ బాగా ఎక్కువైపోయింది. స్టార్ యాంకర్ అనిపించుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘జబర్ధస్త్’ ‘ఎక్స్ ట్రా జబర్ధస్త్’ కామెడీ షోల ద్వారా అనసూయ – రష్మీ గౌతమ్ లు ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ బుల్లితెరపై పలు షోస్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎంత ఒకే షో చేస్తున్నా వర్క్ పరంగా పోటీ అనేది ఉంటుంది కదా. వీరి మధ్య కూడా అలాంటి పోటీతత్వం పెరిగిపోయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా అన్ని షోల షూటింగ్స్ తో పాటు ఈ యాంకరమ్మల కామెడీ షోల షూటింగ్స్ కూడా నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ‘జబర్ధస్త్’ ‘ఎక్స్ ట్రా జబర్ధస్త్’ ప్రోగ్రామ్స్ మళ్లీ పున: ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన రేటింగ్స్ అనసూయ భరద్వాజ్ ని షాక్ అయ్యేలా చేసాయి.

టీఆర్పీ రేటింగ్స్ లో అనసూయ యాంకర్ గా చేస్తున్న ’జబర్దస్త్’ షో కంటే రష్మీ యాంకర్ గా చేస్తున్న ’ఎక్స్ ట్రా జబర్దస్త్’ కు ఎక్కువ టీఆర్పీలు వచ్చాయి. గత రెండు వారాలుగా అనసూయ జబర్దస్త్ కంటే రష్మి ఎక్స్ ట్రా జబర్దస్త్ టీఆర్పీలు ఎక్కువగా ఉండటంతో రష్మీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే లాక్ డౌన్ కంటే ముందు రష్మీ కంటే అనసూయ చేసే జబర్దస్త్ కే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. దీనికి అనసూయ తన ఫిట్ నెస్ కోల్పోవడమే కాకుండా ఇప్పుడు షోలో తన లుక్స్ పెద్దగా ఎట్రాక్టీవ్ గా లేవనే కామెంట్స్ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అటు రష్మీ గౌతమ్ కి మాత్రం ఫుల్ లైక్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోగ్రామ్ థీమ్ ఒకటే అయినా రేటింగ్స్ విషయంలో మాత్రం రష్మీ ‘ఎక్స్ ట్రా జబర్ధస్త్’ ప్రోగ్రామ్ చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది.

ప్రభాస్ ’రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్..!

నా పెళ్లి గురించి మీకెందుకు.. : రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ 4లో వర్మ ’నగ్నం బ్యూటీ’.. ?

నాకు కరోనా వస్తే పవన్ కనీసం ఫోన్ చేయలేదు : బండ్ల గణేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -