Saturday, April 20, 2024
- Advertisement -

డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా.. రష్మీ కామెంట్స్..!

- Advertisement -

ఏ సినిమా పరిశ్రమలో అయిన ఎంత టాలెంట్ ఉన్నా చివరికి చుసేది డబ్బు కోసమే. కేవలం కొందరు మాత్రమే క్రియేటివ్ శాటిస్పాక్షన్ కోసం పని చేస్తుంటారు. ఇదే విషయంను నిజం అంటుంది టాలీవుడ్ హీరోయిన్, బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్. ఇక్కడ డబ్బుల కోసం సినిమాలు చేయాలి లేకుంటే మనసుకు నచ్చిన పాత్రలు చేయాలి.

తనకు ఎవరు కూడా మంచి పాత్ర ఇవ్వడం లేదని.. ఎలాంటి రోల్స్ చేయడానికి అయిన రెడీగా ఉన్నప్పటికి ఎవరు ఛాలెంజింగ్ రోల్స్ ఇవ్వడం లేదని రష్మీ చెబుతోంది. అందుకే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఒక్కటి కూడా ఏ దర్శకుడు ఇవ్వలేదని.. తనను కేవలం ఒక గ్లామర్ డాల్ గానే దర్శకులు చూస్తున్నారే తప్ప స్పెషల్ రోల్స్ నాతో చేయించాలనుకోవడంలేదని తెలిపింది.

తనకు కూడా మంచి పాత్రలు చేయాలని ఎంతో ఆశగా ఉంటుందని.. కానీ అలాంటి రోల్స్ రాకుంటే ఏం చేస్తాను అని ప్రశ్నిస్తోంది. అందుకే కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ అయిన పెంచుకోవాలని ఇలా ఏ పాత్ర వచ్చిన చేస్తున్నట్లు చెప్పింది. ఇక డబ్బులు ఇస్తున్నప్పుడు ఎక్స్ పోజింగ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని.. కొన్నిసార్లు డబ్బుల కోసం కాకుండా క్రియేటివ్ సైడ్ వర్క్ చేయాలనిపిస్తుందని.. అందుకే వెబ్ సిరీస్ చేయడానికి అలోఇస్తున్నట్లు తెలిపింది ఈ హాట్ యాంకర్. సో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ప్రాసెస్ ను రష్మీ బాగా ఫాలో అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -