Thursday, March 28, 2024
- Advertisement -

బాలయ్య మూవీ లో రష్మీ.. అదిరిపోయే రోల్!

- Advertisement -

రష్మీ గౌతమ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. యాంకరింగ్ చేస్తునే సినిమాల్లో కూడా నటిస్తోంది. తన అందంతో ఎంతో మందిని తనవైపుకు తిప్పుకుంది. తరుచూ ఫోటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో రష్మీ ఓ బంపర్ ఆఫర్ పట్టేసిందని తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’, ‘ఢీ’ షోలకు యాంకరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది రష్మీ గౌతమ్. ఈ రెండింటిలో సుడిగాలి సుధీర్ కూడా ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొంత మంది అయితే రష్మీ – సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అన్నారు. దీంతో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వీరిద్దరు చెబుతున్నప్పటికి తమ ఈ రూమర్స్ ఆగడం లేదు.

తాజా రష్మీకి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ చక్కర్లు కొడుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అది కూడా ఎంతో ముఖ్యమైన పాత్రట. ఈ పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -