Friday, March 29, 2024
- Advertisement -

అవి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు

- Advertisement -

రష్మి నటించిన తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఇటివలే ఈ సినిమా లో రష్మి ముద్దు సీన్లు యమ హాటుగా నటించి అందరిని షాక్ చేసింది. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అంటుంది రష్మి. హీరోయిన్‍గా కాక భవిష్యత్తులో ఐటం సాంగ్స్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని అంటుంది.

టీవీ షోల కంటే ముందు తాను సినిమాల్లోనే చేసానని… అయితే అప్పుడు తనకు గుర్తింపు రాలేదని రష్మి చెప్పుకొచ్చింది. గతంలో సినిమాలు చేసాను, కానీ చాలామంది నన్ను మోసం చేశారు. కథ ఒకటి చెప్పి మరొకటి తీసేవారు. ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తాను అని చెప్పి అసలు ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు అని చెపుతుంది.

చాలా కాలం తర్వాత ప్రవీణ్‌ సత్తార్‌ గారు చెప్పిన ‘గుంటూర్‌ టాకీస్‌’ కథ స్టోరీ బాగా నచ్చింది. ఇందులో స్క్రిప్టు డిమాండ్ చేయడంతో కొన్ని శృంగార సన్నివేశాలు చేసారు. ఏదో ఒకటి రెండు సన్నివేశాలు చూసి రెచ్చిపోయి నటించాను అనడం సరి కాదు. సినిమా చూసిన తరువాత చెప్పండి. సినిమాకు ఎంత వరకూ అవసరమో అంత వరకే శృంగార సన్నివేశాలు ఉంటాయి తప్ప మితిమీరి ఉండవు అని రష్మి స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -